మద్యం మత్తులో ఉన్న ఓ జడ్జి తన భార్యను కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జడ్జి జెఫ్రీ ఫెర్గూసన్ తన భార్యతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాగ్వాదం కొనసాగింది. దీంతో భార్య షెరిల్‌ను మద్యం మత్తులో ఉన్న పెర్గూసన్ తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి తుపాకీతోపాటు 47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.