అనంతపురం వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బుధవారం మున్సిపల్ పరిధిలోని మూడవ రోడ్డు జీఆర్ ఫంక్షన్ మరియు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఆ ప్రాంతాలలో వెళ్లాలంటే ఏ క్షణంలో కుక్కులు దాడి చేస్తాయోనని జనం జంకుతున్నారు. ఇప్పటికయినా అధికారలు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa