ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరోసారి మండిపోతున్న ఎండలు,,,,సాధారణం కంటే అధికంగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2023, 08:10 PM

ఏపీలో ఎండలకు తోడు ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు కురువాల్సింది పోయి.. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం విచిత్రంగా ఉందంటున్నారు. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.. ఎండలు ఇలా మండిపోవడానికి కారణాలను వెల్లడించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని తెలిపింది. ఎండలకు తోడు ఉక్కపోత కూడ తోడవుతుంది అన్నారు. వాతావరణంలోని మార్పుల వలన ఈ పరిస్థితి ఉందని.. మాములుగా అయితే మే నెల నుంచి ఆగష్టు వరకు ఏపీ వాతావరణంపై సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉంటుంది అన్నారు. భూమి ఉపరితలంకి వచ్చే సూర్యకిరణాల ప్రసరణ వర్షాకాలంలో ఉండే మేఘాల కారణంగా వేసవితో పోలిస్తే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది అన్నారు. ప్రస్తుతం ఏపీ పైభాగంలో మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపారు. ఈ అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.


అందుకే రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు అవుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి ఉక్కపోత కూడ తోడవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎండలు పెరిగాయి.. పైగా వానాకాలంలో వర్షాలు కురిసింది తక్కువే అంటున్నారు. జులై నెలలో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి తప్ప ఆశించిన స్థాయిలో మాత్రం వానలు పడలేదు. వాస్తవానికి ఆగస్టు నెలలో వర్షాలు విస్తారంగా కురవాలి.. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తానికి ఆగస్టు నెల కూడా ఎండాకాలాన్ని తలపిస్తుందనే చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa