విజయవాడలో ఈనెల 21న ఏపీ ఎన్జిఒ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని అసోసియేషన్ జిల్లా నాయకులు బుధవారం గుంటూరు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ యం. వేణుగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రం అందజేశారు. 21న విజయవాడలో జరిగే ఏపీ ఎన్జిఒ సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఒ జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.