డెంగీ లక్షణాలతో పదేళ్ల బాలుడు అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం కారంపూడి సుద్దగుంతల కాలనీలో బయట పడింది. కాలనీకి చెందిన బాలుడు ఈ నెల 12 నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎంతకీ కోలుకోకపోవడంతో రక్తపరీక్షలు చేయించగా డెంగీ లక్షణాలు బయట పడ్డాయి. దీంతో అతడిని కుటుంబసభ్యులు గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య సిబ్బంది జ్వర సర్వే చేసి మలేరియా, ఒకరికి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేశారు.