ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేకి కేవలం ఐదు రోజులే గడువు ఉందని, ఆలోగా పని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఇంటింటి సర్వే పై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సమీక్షించారు.