మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం అలిపిరి నడకమార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను భూమన ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కర్రలు ఇచ్చి బాధ్యతల నుంచి టీటీడీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందనడం సమజసం కాదని చెప్పారు.