‘రివెంజ్ పోర్న్’ కేసులో అమెరికాలోని టెక్సాస్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు పరిహారం కింద $1.2 బిలియన్లు(దాదాపు రూ.10 వేల కోట్లు) చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. బ్రేకప్ తర్వాత తన మాజీ బాయ్‌ఫ్రెండ్ మానసికంగా,లైంగికంగా వేధించాడని ఓ మహిళ 2022లో కేసువేసింది. అతనితో సన్నిహితంగా మెలిగిన ఫొటోలను పోర్న్‌సైట్లలో పెట్టాడని తెలిపింది. విచారించిన కోర్టు నిందితుడికి భారీ జరిమానా విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa