తిరుమలలో మరో చిరుత బోనుకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయమై వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ సతీష్ మీడియాతో మాట్లాడుతూ.. నరశింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కిందన్నారు. ఆలయానికి సమీప ప్రాంతంలోని ఐదు వందల మీటర్ల రేడియేషన్లో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నెల 14వ తారీఖున చిక్కిన చిరుతను ఎస్వీ జూపార్క్ కి తరలించామన్నారు. మరో చిరుత కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు వేకువజామున రెండు గంటలకు మరో చిరుత బోనుకు చిక్కిందని సతీష్ తెలిపారు. దీనిని ఎస్వీ జూపార్క్ కు తరలిస్తున్నామన్నారు. చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్ళు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటామన్నారు. ఆ తర్వాత ఫారెస్ట్ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకూ జూలో ఉంచాలా లేక ఫారెస్ట్ లో ఉంచాలా అన్నది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆడచిరుత బోనుకు చిక్కిందన్నారు.