ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో అర్ధరాత్రి మహాత్మాగాంధీజీ, ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఈరోజు (గురువారం) ఉదయం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాని ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనిపై దేవినేని మాట్లాడుతూ... వైసీపీ నాయకుల చెప్పు చేతల్లో కొంతమంది అధికారులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించారన్నారు. అడిగితే తమ టీడీపీ వాళ్లను అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమీ న్యాయం... అధికారులూ ఆలోచించండి అంటూ దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారు.