తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోమారు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రి మున్సిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నాడంటూ మండిపడ్డారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. పోలీస్ స్టేషన్ కోసం మున్సిపాలిటీ స్థలాన్ని తీసుకుంటున్నారని.. అక్కడ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. మార్కెట్లో దుకాణాలను ఎమ్మెల్యే మనుషులకు ఇచ్చారన్నారు. టీడీపీ కౌన్సిలర్ రాబర్ట్‌ను వైసీపీలో చేర్చుకుని మున్సిపల్ స్థలాన్ని కట్టబెట్టి బిర్యానీ సెంటర్ పెట్టిస్తున్నారని తెలిపారు. కలెక్టర్, ఎస్పీకి చెప్పినా ఒక్క అధికారి కూడా పట్టించుకోరని అన్నారు.