అనకాపల్లి జిల్లాలో బాలిక కిడ్నాప్ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు ఎక్కువగా కిడ్నాప్‌నకు గురవతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికలే ఎక్కువగా మిస్ అవుతున్నారన్నారు. ఫిర్యాదులు చేస్తే... విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. 30 వేలపై చిలుకు అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఎప్పటి నుంచో కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయని పవన్ అన్నారు. పోలీసు శాఖ ఎందుకు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లడం లేదన్నారు. రిట్ పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకోమంటున్నారని నిలదీశారు.