ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సౌమ్య ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జిల్లాలో మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపుకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి నిరసన తేలడానికి బయలుదేరిన సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సౌమ్య ఇంటి నుంచి కమిషనర్ కార్యాలయానికి బయలుదేరిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సౌమ్య, టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.