విశాఖపట్నం నగరంలోని అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలని, తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘం నేతలు పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. దీనితో అదాని పోర్టు పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోర్టు ప్రధాన ద్వారం వద్దకు కార్మికులు, కార్మిక సంఘం నేతలు భారీగా చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికులకు పోలీసులకి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో పది మంది పోలీసులకు గాయాలయ్యాయి. గాజువాక సీ.ఐ కాలికి ముల్ల కంచె దిగగా.. ఇద్దరు కానిస్టేబుళ్లకు తలకి తీవ్ర గాయాలయ్యాయి. పోర్టు వద్ద బ్యారికేడ్లు పెట్టి మరీ పోలీసులు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.