గుంటూరు కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ కావటి మనోహర్ టార్గెట్గా ఎమ్మెల్యే ముస్తఫా విమర్శలు గుప్పించారు. రెండేళ్ళుగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి చేయడంపై మేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిధుల కొరత కారణంగా పనులు జరగడం లేదంటూ మేయర్ చెబుతున్నారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మేయర్ కావటి స్పందించారు. తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై అన్ని లెక్కలు ఇస్తామన్నారు. ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మేయర్ అన్నారు.