టీడీపీ నేత బోండా ఉమా విజయవాడ పోలీసులపై ఆగ్రహం వ్యక్తపరిచారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్లకు అన్నదానం రోడ్డు ప్రక్కన చేస్తామంటే అనుమతిని ఇవ్వనని.. అరెస్ట్ చేస్తానని సీఐ అన్నారన్నారు. టీడీపీ బ్యానర్లను సీఐ తొలగించటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటమా టీడీపీ బ్యానర్లను తొలగించటమా అని ప్రశ్నించారు. స్టేషన్కు వచ్చిన వాళ్ళను లంచాలతో వేధించటం, ప్రైవేటు సెటిల్మెంట్లు చేయటం వంటి సీఐ సలామ్పై అనేక అరోపణలు వస్తున్నాయని తెలిపారు. సలామ్ అవినీతి అక్రమాలపై సీపీకి పిర్యాదు చేస్తామని బోండా ఉమా పేర్కొన్నారు.