టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. 13 వేల మంది సర్పంచులు ప్రజలు కోసం పనిచేయాలన్నారు. సర్పంచులు హక్కులను జగన్ కాలరాస్తున్నారని మండిపడ్డారు. సర్పంచుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని చెప్పారు. 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని చంద్రబాబు నాయుడు తెలిపారు.