ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలన్నారు. ఇతరదేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలని సూచించారు. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.