పోలీసులపైనే దాడిచేయించిన ఈ టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ కాక ఏమవుతుంది..? ఏపీలో ఈ రోజుకు కూడా చంద్రబాబుకు ఒక స్థిర నివాసం లేదు. ఆయన తెలంగాణలోనే ఉంటున్నాడు. ఇక చంద్రబాబు ప్రవాసాంద్రుడు కాక ఏమవుతాడు..అలాంటి పార్టీని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు అని వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి మాట్లాడారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్. సామాజిక న్యాయం అంటూ ఊదరగొట్టే చంద్రబాబు ప్రతి విషయంలో కులం, మతం చూస్తాడు..వాటికి అతీతంగా ఆయన పనిచేసింది లేదు. మీడియా, సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ తాను ఒక విజనరీ అని చిత్రీకరించుకుంటున్నాడు. విజన్ 2020 అన్నాడు...అది అయిపోయింది..ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. 2047 నాటికి చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడో మీరే ఊహించుకోండి. ప్రజల్ని నమ్మించి మోసం చేసేందుకు ఇలాంటి విజన్ డాక్యుమెంట్లు విడుదల చేస్తుంటాడు అని తెలియజేసారు.