ఆర్టీసీలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ నాయకులు పుట్టపర్తి నియోజకవర్గంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి ప్లకార్డులతో తహసీల్దార్ కార్యాలయం వరకు అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని నినాదించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు.