ఏపీలో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే తాను పోటీ చేయనున్నట్లు టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అన్నారు. వైసీపీ నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళగిరి కోర్టుకు హాజరై మాట్లాడారు. మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచేది తానేనని అన్నారు. వైసీపీ పాలనలో పరిశ్రమలేవీ రాష్ట్రానికి రావట్లేదని.. ఉన్నవి కూడా తరలిపోతున్నాయని లోకేష్ మండిపడ్డారు.