రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి విజయచంద్ర పిలుపునిచ్చారు. గురువారం పార్వతీపురం మండలంలోని ములగ పంచాయతీలో మహాశక్తి కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంగాపలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ..... వచ్చేఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. టీడీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ మహిళల పక్షపాతి చంద్రబాబు అన్నారు.