కర్నూలు జిల్లా దేవనకొండలో ఒక అవమానియమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... గద్దెరాళ్ల గ్రామానికి చెందిన అనిత, నంద్యాల జిల్లా డోన్ మండలం పెద్ద పూజర్ల గ్రామానికి చెందిన రాజు(32) 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ కుమారుడు జన్మించిన తర్వాత అనితపై రాజు అనుమానం పెంచుకున్నాడు. ఇదే సమయంలో వారికి మరో కుమారుడు ప్రజ్వల్(3) జన్మించాడు. రెండో కుమారుడు తనకు పుట్టలేదని రాజు అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు జరుగుతుండటంతో వారు విడివిడిగా ఉంటున్నారు. గురువారం అనిత వద్దకు రాజు వచ్చి గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోయి ఆమెను తీవ్రంగా కొట్టాడు. వేటకొడవలితో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తండ్రికి ప్రజ్వల్ అడ్డుపడటంతో మరింత ఆగ్రహంతో ఊగిపోయి ప్రజ్వల్ ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. కొడుక్కి బలవంతంగా పురుగులమందు తాపించి..ఆపై తానూ తాగేశాడు.