ఏలూరు జిల్లా, దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయితీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చేందుకు ప్రయత్నించగా డీఎస్పీ అడ్డుకున్నారు. రౌడీ షీటర్ను పోలింగ్ కేంద్రం వైపు రానివ్వకు అంటూ డీఎస్పీ తేల్చి చెప్పారు. తాను రౌడీ షీటర్ అయితే ఎందుకు బైండోవర్ చేయలేదని చింతమనేని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొంత వాగ్వాదం చోటుచేసుకోగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని అశోక్ కుమార్ గౌడ్ వెనక్కి పంపించేశారు.