తిరుమలలో జరుగుతున్న చిరుతల వేటకి సంభందించి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించామని.. జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. చిరుత దాడులు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. మ్యాన్ ఈటర్‌గా మారిన రెండు చిరుతలను జూ పార్క్‌లోనే ఉంచుతామని చెప్పారు. శాశ్వత ప్రాతపదికన కంచే ఏర్పాటు చేసే దిశగా టీటీడీ, అటవీ శాఖలు ఆలోచన చేస్తోందని తెలిపారు. టీటీడీ పరిధిలోని అటవీప్రాంతంలో సంఘటన జరిగిందని.. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో టీటీడీకి సహకరిస్తామన్నారు.