కృష్ణా జిల్లా, గన్నవరంలో జరగనున్న టీడీపీ బహిరంగ సభని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న వాపోయారు. ఈ తరుణంలోనే దేవినేని అవినాష్ నివాసంలో సీఎం జగన్ సమావేశం అయ్యారని ఆరోపించారు. మరోసారి దేవినేని అవినాష్‌ని బలి పశువుని చేసే పనిలో సీఎం జగన్ ఉన్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. కచ్చితంగా వైసీపీ కుట్ర పన్నాగాలని సమర్ధవంతంగా ఎదుర్కొంటామన్నారు. ఢీ అంటే ఢీ అనే విధంగా తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ మూకలు ఏ రూపంలో యువగళం పాదయాత్రలోకి వచ్చినా కచ్చితంగా కనిపెట్టి తరిమికొడతామన్నారు.