పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. భార్యను చాకుతో పొడిచి చంపేశాడు. ఆకివీడుకు చెందిన సంధ్యారాణి, రాంబాబు భార్యభర్తలు. అయితే వీరివురి మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. భార్యాభర్తలు ఇరువురూ తరచూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భర్త ఏకంగా ఆమె ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా గుడికి బండిపై వెళ్తున్న భార్య సంధ్యారాణిని భర్త రాంబాబు వెనుక నుంచి వచ్చి చాకుతో పొడిచాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడంతో సంధ్యారాణి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భర్త రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.