అమరావతి మండలంలోని ధరణికోట 11వ వార్డ్ కు జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ సానుభూతిపరుడు కంభంపాటి జైల్ సింగ్ 50 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని మండల వైసీపీ నాయకుడు కొండవీటి కోటేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలే వైసిపి గెలుపుకు దోహదం చేశారని ఆయన అన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ధరణికోట నుంచి భారీ మెజార్టీ వస్తుందని ఆయన తెలిపారు.