సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం రామ్ లల్లాకు ప్రార్థనలు చేసి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులను చూశారు. హనుమాన్ గర్హి ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేశారు. చాలా కాలంగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను.. ఆ కోరిక నెరవేరడం నా అదృష్టం.. భగవంతుడు కోరుకుంటే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ వస్తానని రజనీకాంత్ అన్నారు. రామజన్మభూమి వద్ద ఆయనకు అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ సహా సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ రజనీకాంత్‌కు రామమందిరం నమూనాను, దానిపై రాముడి పేరు నేసిన స్టోల్‌ను బహుకరించారు.అంతకుముందు లక్నోలోని ఆయన నివాసంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో రజనీకాంత్ భేటీ అయ్యారు.