తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం భాకారాపేట ఘాట్ అడవుల్లో మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రామసముద్రం మండలం చిట్టెంవారిపల్లికి చెందిన కళ్యాణి(15), చౌడేపల్లె మండలం జోగిఇండ్లు (కొత్తిండ్లు)కు చెందిన యుగందర్(17) పుంగనూరు ఎంసివి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. వీరిద్దరు గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
18వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లిన ప్రేమికులు.. పెళ్లి చేసుకొని అడవిలో తాడుతో చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. స్థానికులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంసభ్యులకు అందించారు. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డు చెబుతుండడంతో ఈనెల 18న ఇంటి నుండి పరార్ అయినట్లు ఎర్రవారి పాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.