విజయవాడలో సోమ, మంగళవారాల్లో జరిగే ఏపీఎన్జీవో రాష్ట్ర 21వ మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. ఈ సభల్లో సంఘ సమస్యలపై విస్తృతంగా చర్చించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలు తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ మహాసభలకు ఈ సారి కూడా సీఎం జగన్ తొలిరోజు హాజరవుతారని పేర్కొన్నారు. సంఘం తాలూకా, జిల్లా రాష్ట్ర కార్యవర్గ సంఘ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ఆయనవెంట ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa