స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు కోరుచున్నట్లు డెవలప్మెంట్ మేనేజర్, ఎం. దిలీప్ రాజా బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి డివిజన్ పరిధిలోని ఎస్. బి. ఐ, లైఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సేల్స్ ఆఫీసర్ పార్ట్, ఫుల్ టైం ఉద్యోగాలకు నియామకాలు జరుగుతాయన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు మరిన్ని వివరాల కోసం 8639066501 నెంబర్ ద్వారా సంప్రదించాలని దిలీప్ రాజా కోరారు.