పేదలు ఆర్థికంగా ఎదగకూడదు అనే దుర్మార్గపు ఆలోచన బాబు అండ్ కో కు ఉన్నందునే తమ హక్కులను అడుగడుగునా అడ్డుకుంటున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తాళ్ళయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు బుధవారానికి 1060వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపారన్నారు.