తన గన్ మెన్లను తొలగించారని జెసి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2+2 గన్ మెన్లు ఉంటే ఒకరిని తొలగించారు. ప్రస్తుతం ఒక్కరే గన్ మ్యాన్ ఉన్నాడని మండిపడ్డారు. గన్ మెన్లను తీసేయండి తాడిపత్రి ప్రజలే నన్ను కాపాడుకుంటారు. పీడీ యాక్టుతొ లోపలకి పంపుతారా పంపండి అన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి ప్రహారీ గోడ నిర్మాణం సమయంలో బందోబస్తు కోసం మూడు రోజుల పాటు రూ. 25 లక్షల ప్రజల సొమ్ము ఖర్చు చేశారని ఎమ్మెల్యేల కోసం ఎస్పీలు పని చేస్తున్నారా అని నిలదీశారు.