సింగనమల మండలంలో తీవ్ర వర్షాభావం వలన ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని బుధవారం సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పంటలను నాయకులు పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు.