టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అని ఆదర్శప్రాయుడు అని, ఆయనను స్మరించుకోవడం మన బాధ్యత అని తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్ సమావేశం మందిరంలో కలెక్టర్, జిల్లా అధికారులతో కలిసి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.