రామకుప్పం మండలం విజలాపురం సమీపంలోని సంతమిట్ట వద్ద ఉన్న సర్వే నెంబర్ 28 గుట్ట పోరంబోకు మరియు స్మశాన స్థలంలో అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ మురళీ హెచ్చరించారు. బుధవారం స్థలాన్ని సర్వే చేసి హద్దులు, బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమణల గురించి సర్పంచ్ బాబురెడ్డి ఎమ్మెల్సీ భరత్ కు ఫిర్యాదు చేయడంతో భరత్ వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.