ఎర్రగొండపాలెం మండలం కొత్తపల్లి రెస్ట్ రూమ్ సమీపంలో ఈ నెల 16న అనుమానాస్పదంగా బాలుని మృత దేహం లభ్యమైన సంగతి తెలిసిందే. బాలుని ఆచూకీ కోసం పోలీస్ శాఖ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ రెండు రాష్ట్రాల అధికారులకు సమాచారం అందించినట్లు మార్కాపురం డిఎస్పీ వీర రాఘవ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. బాబు వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సి. ఐ మారుతికృష్ణ, ఎస్. ఐ కోటయ్య ఉన్నారు.