చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ ఇంకొద్ది గంటల్లో కానుంది. అయితే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ తర్వాత ‘టచ్ డౌన్ సెన్సార్లు’ ఆన్ బోర్డ్ కంప్యూటర్ కు సందేశాలు పంపుతాయి. ల్యాండింగ్ అయిన 4 గంటల తర్వాత ల్యాండర్ ర్యాంప్ బయటకొస్తుంది. దాన్నుంచి ప్రగ్యాన్ రోవర్ నెమ్మదిగా దిగుతుంది. ల్యాండర్, రోవర్ 14 రోజులు జాబిల్లిపై పరిశోధనలు చేస్తాయి.