మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం దుగ్గిరాల పరిధి రేవేంద్రపాడులో పర్యటన ముగించుకుని మంగళగిరి వస్తున్న సమయంలో పెడవడ్లపుడి రైల్వే బ్రిడ్జి దిగువున ఆటో పల్టీ కొట్టింది, గమనించిన ఎమ్మెల్యే ఆర్కే వెంటనే కాన్వాయ్ ని ఆపి సిబ్బందితో కలిసి ఆటోను లేపి క్షతగాత్రులను రక్షించారు. ఆటోలో ఉన్న 9 నెలల గర్భిణీ లావణ్య ను వెంటనే తన వాహనంలో తన సిబ్బందితో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.