తెనాలి, వైకుంటపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక పర్యవేక్షణలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్ బృందం గురువారం రికార్డుల పరిశీలన నిర్వహించారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని కార్యనిర్వహాణాధికారి తిమ్మానాయుడు కి తెలిపారు.