హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా కులు జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు, భవనాలు ఒక్కసారిగా నేలమట్టమయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అన్నీలోని మార్కెట్ ప్రాంతంలో జరిగింది. భవనాల కింద పలువురు చనిపోయి, చిక్కుకుపోయి ఉంటారని తెలుస్తోంది. ఈ భయానక సంఘటనను కొంతమంది కెమెరాలో బంధించారు.