గుంటూరు జిల్లా, తెనాలి మండలం కొలకలూరులో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. ఈ మేరకు ఇంటింటికి తిరిగి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు గురించి వివరించారు. అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.