అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్లో విదేశాలకు పంచదార ఎగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం వల్ల చెరుకు ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరుకును ఎక్కువగా పండిస్తారు.