భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)కు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) భారీ షాక్ ఇచ్చింది. WFI సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సమాఖ్య ఎన్నికల నిర్వహణలో WFI విఫలమైందని తెలిపింది. ఇందుకు ప్రతిగానే సస్పెండ్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో రెజ్లింగ్ విభాగంలో ప్రపంచ వేదికపై భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.