ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి గతేడాది ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని దాదాపు 7 కోట్ల మందిని దుర్భరమైన పేదరికంలోకి జారీపోయారని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ADB) వెల్లడించింది. ఇందుకు సంబంధించి గురువారం ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల జనాభాలో 3.9శాతానికి సమానమైన 15.5 కోట్ల మంది గతేడాది అత్యంత పేదరికంలో ఉన్నారని అంచనా.