కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అధికారిక నివాసంపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భవనం ప్రహరీ గోడ ధ్వంసమై పెద్ద రంధ్రం ఏర్పడింది. హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాకు చెందిన రహీమ్ ఖాన్ అనే క్యాబ్ డ్రైవర్ సెంట్రల్ ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు నివాసాన్ని కారుతో బలంగా ఢీకొట్టాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రహీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.