ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు గురువారం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పిచడం జరిగినది. ఈ సందర్భంగా సెబ్ సిఐ, ఎన్. లక్ష్మి దుర్గయ్య, ప్రిన్సిపాల్ రామరాజు మాట్లాడుతూ మాదకద్రవ్యాలు తయారుచేయుట, అమ్మడం, రవాణా చేయడం చట్ట్యరీత్యా నేరమన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కి దూరంగా వుండాలని పిలుపునిచ్చారు.