పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో గురువారం హిందూపురం పట్టణంలో సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు పట్టణ నాయకులు రాము మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పంచాయతీ కార్మికులు, స్వచ్ఛభారత్ కార్మికులు మూడు రోజులు సమ్మెచేపట్టడం జరిగిందన్నారు. 20 ఏళ్లుగా కార్మికులు చాలీచాలని వేతనాలతో కాలం నెట్టుకు వస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.