హిందూపురం మున్సిపాలిటీ నందు పరిగి బస్టాండ్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్ వారి కోసం నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక షెడ్లు వలన ఇన్ని సంవత్సరాలుగా అక్కడ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న వందకు పైగా కుటుంబాలు పరిస్థితి దయనీయంగా మారింది. విషయం తెలుసుకున్న టీడిపి నాయకులు గురువారం అక్కడికి చేరుకుని మద్దతుగా నిలిచారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫోన్లో కమిషనర్ తో మాట్లాడారు.